పుట:హంసవింశతి.pdf/90

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

కుచములపైఁ గావికుబులసంబు గళమున
నలరారు రుద్రాక్షహారతతులు
చే నాగబెత్తంబు చిన్నికృష్ణాజిన
మక్షిగోళంబుల నంజనంబు
తే. కావివస్త్రంబు పావాలు కక్షపాల
తామ్రకటకంబు సింగినాదంబు క్రోవి
పొందు సిద్ధక్రియలు చిదానందభూతి
యొనరఁ దాలిచి యొక మహాయోగురాలు.

46. తే. చెట్టుడిగి వచ్చినట్టులఁ జెంతనిలువఁ
జూచి లేచి నృపుండు సంస్తుతుల మ్రొక్కి
పీఁట వేయించి కూర్చుండఁబెట్టి తా సు
ఖాసీనుఁడై యున్న యవసరమున.

47. సీ. శ్రీరస్తు శుభమస్తు ధీరస్తు విజయోఽస్తు
పుత్రరంజనమస్తు పుణ్యమస్తు
ధనమస్తు ధాన్యమస్త్వనవద్యసుఖమస్తు
చిరతరసంకల్పసిద్ధిరస్తు
సత్యమస్తు మహోఽస్తు శౌర్యమస్తు యశోఽస్తు
స్వస్త్యస్తు సుగుణోఽస్తు శక్తిరస్తు
సామ్రాజ్యమస్తు శాశ్వతధర్మఫలమస్తు
వృద్ధిరస్తు మహాప్రసిద్ధిరస్తు
తే. జ్ఞానమస్తు శ్రియఃపతిధ్యానమస్తు
గురుచరణభక్తిరస్తు సత్కుశలమస్తు
శాంతిరస్తు నిరంతరైశ్వర్యమస్తు
భాగ్యమస్తు మహాసార్వభౌమ! నీకు.

48. క. అని దీవి చక్షత పు
ష్పనిచయము విభూతిపండ్లు ఫలములు దివ్యాం