పుట:హంసవింశతి.pdf/83

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ప్రథమాశ్వాసము

భాగవత స్తుతి

తే.

ఆత్మఁ బ్రహ్లాద రుక్మాంగదాంబరీష
శౌనక వ్యాస శుక పరాశర విభీష
ణార్జున వసిష్ఠ పుండరీకాఖ్య భీష్మ
దాల్భ్య నారదముఖ్యులఁ దలఁతు భక్తి.

9

సుకవి స్తుతి

సీ.

వాక్యనిర్జితశేషవాల్మీకి వాల్మీకి
            హరిభక్తియుక్తిధీవ్యాసు వ్యాసు
ఘనభావకాళిదాసును గాళిదాసును
            జారుమాధుర్యవాచోరుఁ జోరు
దివిజేంద్రధనదవైభవభూతి భవభూతి
            ధర్మబుద్ధినవీనదండి దండిఁ
గవితాభ్రహృష్టమాధవమయూరు మయూరు
            భాసరాకృతిపుష్పబాణ బాణు


తే.

మానితాచార మథితాసమాఘు మాఘు
ధ్యానబద్ధమురారి మురారి గాత్ర
పటువిభారవి భారవిఁ బ్రస్తుతింతు
సర్వశబ్దార్థవిజ్ఞానసరణి కొఱకు.

10


ఉ.

నన్నయభట్టు భీమకవినాథునిఁ దిక్కనసోమయాజిఁ బె
ద్దన్నను ముక్కుతిమ్మనసచివాగ్రణి బమ్మెరపోఁతరాజు గౌ
రన్నను రంగనాథుని మహామహుఁ బిల్లలమఱ్ఱి వీరభ
ద్రు న్నుతియింతు నాంధ్రకవిరుద్రుల సత్కరుణాసముద్రులన్.

11


ఉ.

అయ్యలరాజుఁ దిప్పసచివాగ్రణిఁ బర్వతరాజు రామభ
ద్రయ్యను భాస్కరాగ్రణిఁ బ్రధానవరుండగు కొండధీరునిన్
జయ్యనఁ దిమ్మయప్రభుని సత్కవితారచనాఢ్యులైన మా
యయ్యలరాజవంశజుల నాదికవీంద్రుల సన్నుతించెదన్.

12