పుట:హంసవింశతి.pdf/33

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

xxxii


    మందయానపుఁబ్రౌఢిమము మతంగజ ధైర్య
           పర్యాయమెంతయుఁ బగులఁజేయ

తే. నవ సుధామయ మధురోక్తి నైపుణములు
    శుకమనోవృత్తి నెంతయుఁ జులుకఁజేయ
    మెఱుఁగు జిగినిచ్చువగ జగ్గు నెఱతనంబు
    వెలయఁ జరియించు నదియు నవ్వీటిలోన.
                                                  (హంస. 3-130)

నారద భరద్వాజ కుంభజ (అగస్త్య) మతంగ శుకమహర్షులు జితేంద్రియులు. ఆమె జిగిబిగి ఋషుల కొంపలు గూల్చుచుండెనని ఝటితిస్ఫూర్తి. నారదము = మేఘము. భరద్వాజము = ఏట్రింత పక్షి. కుంభము = కుండ, మతంగజము = ఏనుఁగు. శుకము = చిలుక. కొప్పు మేఘమును, కన్నులు ఏట్రింత పులుగును, గుబ్బలు కుండలను, నడక యేనికలను, పలుకులు చిలుకలను భంగించుచుండెనని కవిసమయ వస్తుసిద్ధమగు ప్రకృతార్థము.

చ. పొలఁతుకవేణి కృష్ణతను బొందిన యంతనె మోము సూడుచేఁ
    దలఁకి విధుస్థితిన్ దనరెఁ దాళక చన్నులు నచ్యుతాకృతిం
    బొలిచె, సహింపలేక నడుమున్ హరిరూపు వహించె, నిట్టి వా
    ర్తలకు మధుద్విషత్త్వమును దాల్చెను జక్కెర లొల్కు మోవియున్.
                                                           (2-235)

ఈ పద్యమున వసుమతి యను వణిక్సతి సౌందర్యము చెప్పఁబడినది. కృష్ణవిధ్యచ్యుతహరి మధుద్విషచ్ఛబ్దములు విష్ణుపర్యాయ శబ్దములు. వేణి (జడ) కృష్ణత్వమును (నల్లదనమును) బొందెను. దానిఁజూచి యీర్ష్యచే మొగము విధుస్థితి (చంద్రుని పోడిమి) దనరెను. దానిఁజూచి తాళలేక చనులు అచ్యుతాకృతి (జాఱని బిగి) బొలిచెను. దానిఁజూచి సహింపలేక నడుము హరిరూపు (సింహము నడుమువంటి సన్ననిరూపు) వహించెను. ఈ వార్తలెఱిఁగి పెదవి మధుద్విషత్త్వమును (తేనెను ద్వేషించుపాటి స్థితి) దాల్చెను. వేణ్యాదులు విష్ణుసారూప్యముఁబొందెను. చిత్తశుద్ధితోఁగాదు-పోటీపడి. ఏమైన అది పవిత్రమైన సిద్ధియే. ఈ సిద్ధి బహిరంగములకే చెప్పఁబడెను. అంతరంగ విషయము చెప్పఁ