పుట:హంసవింశతి.pdf/34

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

xxxiii


బడలేదు. కనుక, ఇతర నాయికలవలెనే యీమెయు నభిసరింపఁబోవును. సంకేతమున మునిచీఁకటిలో విటుఁడై వచ్చిన తన భర్తను గదిసి భోగించును. ఈలువు చెడదు. తదాదిగా నామె భర్తృసౌముఖ్యమునకుఁ బాత్రమయ్యెను. పవిత్రస్త్రీ యయ్యెను. అదియే విష్ణసారూప్య ఫలము, అది ఘుణాక్షర న్యాయమునఁ గుదిరినది.

పండ్రెండవరాత్రి కథలో నాయిక విశాల. ఆమెభర్త పంచాక్షరీజపపరాయణుఁడు- శివదత్తయోగి. కవి పంచాక్షర ప్రాసపద్యముతో విశాలను వర్ణించెను.

ఉ. సారసమా, నవీనఘృణి సంపదఁ గాంచును నెమ్మొగంబు కా
    సారసమాన విభ్రవము సారె జయించును నాభియున్ సుధా
    సార సమాన మాధురిని జాల రహించును మోవి చంద్రికా౽
    సార సమాన హృద్య రుచిసంతతి మించును గాంతహాసముల్.
                                                              (3-195)

మగని పంచాక్షరీ మంత్రగతమైన మనస్సును స్వమంత్రగతము గావించు కొనుటకు విశాల యెంత ప్రయాసపడుచుండెనో మఱొక పద్యమున విస్పష్టముగాఁ జెప్పెను.

ఆమెరక్తి యతని విరక్తి యౌగపద్యముగ వాన-యెండ తోఁచినట్లెంత విచిత్రముగ నుండెనో చూడుఁడు.

సీ. పదము లొత్తెదనంచుఁ బతిజంఘికలు తన
           తొడలపై వేసికో మిడిసిపడును
    నడుము పట్టెదనంచు నాథుని చిఱుదొడల్
           పుడికినఁ 'జీ' యని పొరలు నవల
    నుతబర్హ మెగద్రోయ నుంకించి మోముపై
           మోముఁ జేర్చినఁ జూచి ముదుగులాడు
    వ్రేల్మెటికలు దీయ వెసనెత్తి హస్తంబు
           కుచములపై వేసికొనినఁ దిట్టుఁ