పుట:హంసవింశతి.pdf/3

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ii


అమాత్య నియోగి శబ్దములు గ్రామకరణమున కుపలక్షకములుగా నితఁడు ప్రయోగించెను.

“దిగులుం బొంది నియోగి యెట్టు లనుచున్ దేహంబు కంపింప, నా చిగురుంబోఁడి యమాత్యు వీఁ పడఁచి తాఁ జెన్నొంద" (3-100) ఈపద్యమున 'నియోగి', 'అమాత్యుఁడు' ఊరి కరణమే (పదవ కథ). కనుక నారాయణకవి ఒకరికిఁ బెట్టుటకుఁ దాఁ దినుటకుఁ జాలినంత కలిమిగల సంపన్న గృహస్థు, కరణము అని చెప్ప వచ్చును.

అల్లసాని పెద్దనామాత్యుఁడు కరణమేనా ? అన్నచోఁ గరణముకాఁడు. విద్యా శాఖామాత్యుఁడే. ప్రస్తుతకవి కరణ మని చెప్పుటకు గ్రంథమే సాక్షి.

దేశము

అవతారిక యందుఁ గవి తన యింటి చాలు జెప్పికొన్నాఁడు.

ఉ. అయ్యలరాజుఁ దిప్ప సచివాగ్రణిఁ బర్వతరాజు రామ భ
ద్రయ్యను భాస్కరాగ్రణిఁ బ్రధానవరుండగు కొండ ధీరునిన్
జయ్యనఁ దిమ్మయ ప్రభుని సత్కవితా రచనాఢ్యులైన మా
యయ్యలరాజు వంశజుల నాదికవీంద్రుల సన్నుతించెదన్. (1-12)

అయ్యలరాజు వంశపుఁ గుదురు కడప మండలమున నున్నది. ఆచార్య కె. వి ఆర్. నరసింహముగారు రామాభ్యుదయ పీఠికయందు “రామభద్రకవి పూర్వులు తర తరములనుండియు నేఁటి కడప మండలము లోని యొంటిమిట్ట యందు నివసించుచుండి రనియు నీ కవి గూడఁ దన బాల్య మంతయు నందే గడపి యుండుననియు మనము నిశ్చయముగాఁ జెప్పవచ్చు” నని వ్రాసిరి. కనుక నీకవి యొంటిమిట్ట ప్రాంతమునఁ బుట్టెనని చెప్పవచ్చును.

కీ|| శే| కావ్యపురాణస్మృతి తీర్థులు జనమంచి శేషాద్రి శర్మగారు, కడప జిల్లా పుల్లంపేట తాలూకాలోని పొత్తపి యను గ్రామమున నారాయణకవి