పుట:సౌగంధిక ప్రసవాపహరణము.pdf/477

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

436

సౌగంధిక ప్రసవాపహరణము



జగముల నింకొక సాటున గలదు;
తెగి పూఁటబడినచో దిద్దగావలయు[1]
తగఁదోడుపోయినఁ దచ్చనల్ దగదు
జగడంబులోన వంచన సేయరాదు
నిన్ను నమ్మినవాఁడు నెమ్మి ధర్మజుఁడు
నన్ను నమ్మినవాఁడు నరవాహనుండు
నీవె గెల్తువటంచు నే గెల్తునంచు
భావింపుచున్నారు బవరంబు మాని
వారికి వేడుకల్ పాటుల్ల మనము
పోరి నాయ మెరింగి పోట్లాడవలయు
గరిమతో సాధనకయ్యముల్ సేయ
పరికించువారెల్లఁ ఒక పక నగ రె!
సొలవక నీ నేర్పుఁ జూచెద నేను
కలగక నా నేర్పు గనుఁగొను నీవు
అని కేల కేలికేరాభీలజాల
జనన తేజఃకాండచండస్ఫులింగ

  1. తెగి పూఁటబడినచో దీర్ఛగావలయు (2421)