పుట:సౌగంధిక ప్రసవాపహరణము.pdf/478

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

తృతీయాశ్వాసము

437


మాలికాలంకార మహితత్రిశృంగ
పాలితఖురాలక పాలమై వెలయు [1]
శూలంబుఁ గైకొని సూటీగాఁ బూని
పోలించి శౌరిపైఁ బూని నిల్చుటయు, 1680
కనకాంబరుఁడు మహా గ్రహమున గెరలి

హరిహరుల సమరము
 
కనలి శంకరుని యగ్గలిక వీక్షించి
తగవు లెంచకు మింక ధర్మంబుగాదు
తెగి మరికొంచించితే కార్యహాని
యని పేర్చి పాంచజన్యంబుఁ బూరించి1685
తనర దక్షిణభుజాదండంబునందు
మధుకైటాభాసురమస్తకకంఠ
రుధిరానులేప నారుణిమసంక్రాంత
బహుతరాజ్యాహుతప్రకటప్రయోగ
సహనహుతాశనజ్వాలికాజాల1690

  1. a. పాలికకాలవ పాలమై వెలయు (ట)
    b. ఫాలికాశారాలఫాలమై వెలయు (శ),