పుట:సౌగంధిక ప్రసవాపహరణము.pdf/476

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

తృతీయాశ్వాసము




జనుదేర శౌరి యాశరము నీక్షించి
వనజాసనాస్త్రంబు వైచి నిల్పుటయు;
గజచర్మధరుఁడు దగ్గర జేర నేఁగి

హరిహరసంవాదము

గజవరదునిమోముఁ గనుఁగొని పలికె1650
సరసిజలోచన! జగములఁ బ్రోవ
ధరణీభారము మాన్పఁ దనర నిర్మింప
నీవు నేనునుదక్క నిఖిలలోకముల
భావింపఁగలరె! యీ ప్రతిభలు వారు
ధననాథ పాండురాట్తనయులవలన1655

మనలోన మనకింత మాత్సర్య మొదవె
జగతి నెవ్వరికైనసరి జంపరాని[1]
పగ గెల్వరా దను పటువాక్యసరణి
నెరయ చింతించిన నిక్కు వంబాయె;
సరిపోర నిది ధర్మసంకట మాయె;

  1. a. జగతి నెవ్వరికైన సాధింపరాని (ట)
    b. జగతి నెవ్వరికైన సరి చెప్పరాని (త)'