పుట:సౌగంధిక ప్రసవాపహరణము.pdf/475

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

434

సౌగంధిక ప్రసవాపహరణము



భూధరాశుగమునఁ బుష్కరుఁ దునిమి
యోధావళులనెల్ల నొడిఁ ద్రెళ్లనేసి
గాండీవి నొక్కట గళవళపరచి
పుండరీకాక్షుపై భోగిశరంబు
బరపిన హరిరోషభరితుఁడై మండి
గరుడాంబకంబున ఖండింప దాని
గౌరీశుఁ డధికవేగమున సంధించి
శ్రీరమాధ్యక్షుపై శిఖసాయకంబు
పరువడి జొనిపిన పంకజాక్షుండు
వరుణసాయకమున వారించి కినిసి
కనలుచు ఘనఘనాఘన బాణ మేయ
ననిలశరంబున నవి ద్రుంచివైచి
భవుఁడు మహారౌద్ర బాణంబు వరప
నవలీల నారాయణాస్త్రంబు చేత
నలినేసి సమ్మోహనాస్త్రంబు వేయ
చెలఁగి శంభుఁడు శక్తిచే నది ద్రుంచి
యబ్జాక్షుమీఁద మహశస్త్ర మేయ
నబ్జభవాండము లట్టిట్టు జెదరఁ