పుట:సౌగంధిక ప్రసవాపహరణము.pdf/204

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ప్రథమాశ్వాసము

163



చరణంబు లూఁది భూస్థలము ధట్టించి
కనలి మింటను గొట్టి గమకించి వ్రేయ
మునుపటిపొడవున మురియుచు నుండ
నెంతయు వెరగంది యిది చిత్ర మనుచు
చింతించు నరనాథశేఖరుఁ గాంచి 1760
యార్ణవగంభీరుఁ డాంజనేయుండు
కర్ణకఠోరంబుగాఁగ ని ట్లనియె;
నొకపండుకోసమై యూరక నీవు
ప్రకటించి పడరానిపాట్లెల్ల బడితి
వటదుర్ఘటంబైన హాటకాబ్జంబు 1765
లెటువలెఁ దెచ్చిరో యెఱుఁగంగరాదు
ఆతతఫ్రౌఢి ము న్నాడివయట్టు[1]
చేతఁ జూపిన వీరశేఖరుఁ డండ్రు
కడప దాఁటగ లేవు కడువడి మీరి
జడధు లెల్లను దాఁటి చనఁ దలంచెదవు ! 1770
తెగి కూటిలో రాయి తీయగా నోప

  1. 1. ఆతీతఫ్రౌఢి ము న్నాడినమాట. (ట)
    2. ఆతతఫ్రౌఢి మున్నాడినయంత. (వ)