పుట:సౌగంధిక ప్రసవాపహరణము.pdf/203

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

162

సౌగంధిక ప్రసవాపహరణము



పదియు నిరువది ముప్పది నారసములు
పొదివి యేసిన తప్పిపోవుటఁ జూచి
విరివిగా నూరులు వేలు లక్షలును 1745
గురుతరాస్త్రములేయ గురి తాకకున్న
పోతించి కోటు లర్బుదములు మేటి
వాలమ్ము లేసిన‌ వ్యర్థమై చనిన
నచ్చెరువును గోప మధికమై వెలయ[1]
విచ్చలవిడి పండు వీక్షించి చూచి 1750
ఆయెడ పొదినున్న యమ్ము లన్నియును
పోయిన బాండుభూజసూనుఁ డలిగి
కరవాల మంకించి గద్దించి వేయ
బెర బెర చని యది బెళికిపోవుటయు
తరలక కరముల ధనువు సంధించి 1755

  1. నూరు నిన్నూరు మున్నూరు నన్నూరు
    ఘోరాశుగములేయ గురిదాకకున్న
    వేలు లక్షలు కోట్లు వెస నర్బుదములు
    వాలంబు లేసిన వ్యర్థమై చన్నిన
    తచ్చెరువును గోప మదికమై చెలఁగ. (త)