పుట:సౌగంధిక ప్రసవాపహరణము.pdf/205

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

164

సౌగంధిక ప్రసవాపహరణము



వెగయించు సంగడా లెత్తబోయెదవు. [1]
దగదొట్టి మేనెల్ల దల్లడ మొందె
సొగపణంగెను మోము సొబగెల్లఁ దరిగె[2]
పొంగు నొయ్యారంబు పొంగెల్ల నుడిగె 1775
పొగడ నొప్పెడుబాణములు మాయ మాయె
మగతనం బెడలె జృంభణము దొలంగె
నగుబాటు బ్రతుకాయె నరనాథ యింక
యూకించి యూకించి యను రుసు రనఁగ
నీ కేల యీపను ల్నీ చేతఁ గాదు 1780
అచ్చంపుమగలచే నగునట్టిపనులు
పిచ్చుగుం టెక్కడ! పేరెంబు లెందు!
కూడుగూరలు పెద్దకుంభముల్‌ మ్రింగి
వాడియౌ తోడెలివలె డొక్కఁ బెంచి

  1. a. తెగి కూటిలో రాయి తీయంగా లేవు
    ఎగరుచు జంగరా ళెత్తబూనెదవు. (మ)
     b .తెగి కూటిలో రాయి తీయఁగా నోప
    వెగయుచు జంగరా ళ్లెత్తబూనెదవు. (త)
  2. నుగు లడంగెను మోము సొబగెల్లఁ దరిగె. (ట)