పుట:సౌగంధిక ప్రసవాపహరణము.pdf/132

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ప్రథమాశ్వాసము

89


నకులుని ప్ర ....

అనఘాత్మ మీ పల్కు లవియెల్ల నిజము
కరమర్థి మీయనుగ్రహమున నేఁగ
యిరవొంద వనభూమి కేతెంచునపుడు
నన్ను వీక్షించి గంథవహాత్మజుండు
నన్నల బిల్చి హస్తంబుఁ జేపట్టి 550
ఎన్నెన్ని విధముల నిటచాటి చాటి
యన్న యున్నాఁ డని యరిగె నెంతయును
పదరక నాతని పటువాక్యసరణి
మదిలో విచారించు మానవాధీశ![1]
మనమీద క్రోధ మేమరడు రారాజు 665
దిన రాజసుతుఁడు బోధించు నాతనికి
చలమున శకుని దుశ్శాసను లెవుడు
పెలుచ మచ్చరములు పేర్చుచుండుదురు
కనుగల్గియుండక గడుమోసపోయి.[2]

  1. ఆ మహామహుని వాక్యము నిక్క మరయ
      నీమది దలపోయు నృపకులోత్తంస (2421)
  2. కనుగల్గియుండ కిక్కడ మోసపోయి (2421)