పుట:సౌగంధిక ప్రసవాపహరణము.pdf/131

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

88

సౌగంధిక ప్రసవాపహరణము


సారంగవిభవంబు జలజాక్షివేణి
సారంగవిభవంబు చామయానంబు
హరివినోదంబు తొయ్యలి రోమరాజి
హరివినోదంబు కంజాక్షి , నెన్నడుము !
అబ్జ సౌభాగ్యంబు హరిణాక్షిగళము
అబ్జ సౌభాగ్యంబు అతివ హస్తంబు
దానివిలాసంబు దాని రూపంబు
దానినిటారంబు దాని చెల్వంబు
దానివయ్యారంబు దగఁగాంచిరేని[1]
మౌనీంద్రులకు నెల్ల మది బెగ్గడిల్లు
వనితయు మారుతి వచ్చునందాక
ననుమాన మగుచున్న దనఘాత్మ నాకు
పదపడి వారివెంబడి పడి నీవు
కదలిన నామది కలగదీరెడీని
అన విని నకులుడు యమసూతుఁ జూచి[2]

  1. దాని యొయ్యారముల్దగఁగాంచిరేని (ప)
  2. అన విని గాండీవ యెన్న కిట్లనియె (త )