పుట:సౌగంధిక ప్రసవాపహరణము.pdf/133

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

90

సౌగంధిక ప్రసవాపహరణము


వెనుక చింతించుట వెఱ్ఱితనంబు
ధరణిపై పవననందనుఁ డజేయుండు
నెరయ నాతనిబల్మి నీ వెఱుంగుదువు
గాక నంతట దొడ్డ కార్యమౌనేని
యాకట వనుల కేనరిగెదగాని
వెనుక బుద్ధులు పదివేలుచెప్పుదురు
జననాథ యిపు డిది సమ్మతిగాదు
నావిని ధర్మనందనుఁ డట్టినీతి
దా విచారించి యంతయు నూరకుండె
అంతట పవచుజుఁ డలివేణి దాను
కొంతద వ్వరు దెంచి కోమలిఁ గొంచి

ద్రౌపదీదేవి వనవిహారము.
 
వనజాక్షి మాయన్న వలదన్న వినక
వనవిహారము వాంఛ వచ్చితి వీవు
అనువొంద యేఫలం బనుభవించితివి [1]

  1. ననుబోటి బలశౌర్యనయకాలివెంట (ట)
      ననువంటి బలశౌర్య నయశాలివెంట(ప)