ఈ పుట ఆమోదించబడ్డది
80
సౌగంధిక ప్రసవాపహరణము
సరయ హిడింబి బకాసురవీర
వరుల చెండాడినవరబాహుబలుడు
సందేహ మేటికి సామీరి వెంట 520
యిందీవరాణీని నిపు డంప నగును
నావిని ధర్మనందనుతోడ నకులుఁ
డావెస నిట్లను ననుమోద మెసఁగ
తావకకీర్తి ప్రతాపము ల్సకల
దేవులయందెల్లఁ దేజరిల్లఁగను 525
భీమసేనునిగదా భీమప్రచండ
ధామ విజృంభితోద్దండప్రదీప్త
శిఖశిఖారేఖప్రసిద్ధతేజంబు
అఖిలలోకంబులయందు వెలుంగ
నక్షీణరథ కేతనాశ్వసారథులు 530
గలమహాబలశౌర్యగాంభీర్య దైర్య
- 249-290 పంక్తుల స్థానమున ఈ విషయము (291-531 పంక్తులు ) ఆంధ్ర సాహిత్య పరిషత్తు వారికడనున్న (త ) యను తాళపత్ర ప్రతియం దున్నది.