Jump to content

పుట:సౌగంధిక ప్రసవాపహరణము.pdf/124

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ప్రథమాశ్వాసము


కలిత తేజోనిధి గాండీవి గలుగ
నిన్నిఁటికన్నను హితుఁడు బాంధవుండు
వెన్నుఁడు గలుగంగ వెరవేల మనకు
దర్పణంబునఁ బర్వత ప్రకాండంబు
లోర్పున నణుకులై యున్న చందంబు
నకట దేవరపాలి యాజ్ఞలోఁ జిక్కి
యొకకొంతవెరపుచే నుందురుగాని
ధరణిశ నీ సహోదరులు గోపింప
కురురా జనఁగ నెంత కురుయోధు లెంత
సురవరు లెంత రక్షోవీరు లెంత
గరుడనాయకు లెంత గంధర్వు లెంత
నరు లన నెంత కిన్నరులన నెంత
పరగ త్రిలోకాధిపతు లన నెంత
నెలకొని నీబల్మి నీ వెరుంగకను

సహదేవుఁడు ద్రౌపది నంపుమనుట

తలపోయనేటికి ద్రౌపది ననుపుఁ
డన విని సహదేవుఁ డగ్రజుతోడ
ననువొంద నిట్లను నవనీతలేంద్ర