Jump to content

పుట:సౌగంధిక ప్రసవాపహరణము.pdf/119

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

76

సౌగంధిక ప్రసవాపహరణము



ధీరుఁడై కోరలు దీటుచున్నాఁడు
ఈవేళ మనపైన భీష్టంబు లేక
దైవరాయఁడు దయదప్పియున్నాడు
అక్కడ నొకకార్యమై చిక్కువడిన
పక్కున నగరె! యాపగవారలెల్ల
సమయంబుగా దని సరసోక్తిమీర
కమలాక్షికిని దెల్పఁగా దగుననిన
విని సంతసించి యావివ్వచ్చుఁ డపుడు
ననబోణి వీక్షించి నగుచు నిట్లనియు,
ఫుల్లాబ్జగంధి! యోభుజగేంద్రవేణి
పల్లవపాణి యోపాంచాలతనయ
కోమలి యిది యెంత కోర్కె గోరితిని
యామహాగగనంబునందు పోవలదు
మృదులాంబుజంబుల మీరు నీతళుకు
పదముల కేల యీపాషాణ బాధ
నాకలోకమునందు నఖిలవస్తువులు
నీకు దెచ్చితి నేను నెమ్మితో నిపుడు
మందారకుసుమదామములు నిచ్చెదను