పుట:సౌగంధిక ప్రసవాపహరణము.pdf/120

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది

ప్రథమాశ్వాసము

77


యిందిందిరాలక యీకోర్కె విడువు
మంచివస్తువులు ప్రేమమున యిచ్చెదను 465
సందీప్త దేవభూషణము లిచ్చెదను
ఇందుబింబానన యీకోర్కె విడుపు
రమణీయదివ్యాంబరము లిచ్చెదను.
కమలయాతాక్షి యీకాంక్షలు విడువు
మంచివస్తువులు ప్రేమమున నిచ్చెదను 470
కాంచననాస! యీకాంక్షలు విడువు
కొంచక దక్కినకోర్కె లిచ్చెదను
కాంచనాంగిరొ! బుద్ధి కాంక్షలు విడువు
అటుగాక చంద్రబింబాస్య , యీ యడవిఁ
బటుతరకాలసర్పంబులు గలవు 475
అరుదందమీనాక్షి యవ్వన భూమి
వరిసంచయములవిహారము ల్గలవు
కరిమదయాన భూగహనంబులందు
గురుతర హర్యక్షకులములు గలవు
అరవిందపాణి! యీయడవిలోపలను 480
దురుసైనగంధసింధూరము ల్గలవు

.