పుట:సౌగంధిక ప్రసవాపహరణము.pdf/113

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది

70

సౌగంధిక ప్రసవాపహరణము


మాండవ్య మైత్రేయ మౌద్గల్య ప్రభృతి
పరమమునీశ్వరుల్ పార్శ్వభాగముల
నరసి పురాణశాస్త్రాదులు చదువ
తుంబురునారదాదులు వీణియలను
తంబురుల్ మీటి గీతములు పాడఁగను
రంభావధూటి తోరంపువక్షోజ
కుంభంబు లొక్కింత కుల్కి చెల్వుగను
కొలువువా రచ్చెరుకొని చూచి మెచ్చి
నలుదెరంగుల హెచ్చి నాట్యంబు సలుప
సురగేంద్రనిభవేణి యూర్వశీరమణి
పరువడి కటికచభారంబులకును
గడువడిఁ బరికింపఁ గద్దు లే దనెడి
నడుము దొట్రుపడంగ నర్తనం బాడ
మెలకువ గతులచే మేనకాలలన
నిలుకడతోఁ జేరి నృత్యంబు సలుప
నలమంజుఘోషామృగాక్షి శాస్త్రోక్తి
నలువునఁ జెలరేఁగి నటనలు సూప
గరుడకిన్నరయక్షఖచరకన్యకలు