Jump to content

పుట:సౌగంధిక ప్రసవాపహరణము.pdf/114

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ప్రథమాశ్వాసము


సిరులు దొలుకఁ జేరి సేవలు సేయ
ఆకటీకట నిల్పి యమరగంధర్వ
రాకేందుముఖులు పరాకులు దెలుప
రహిమించు కాంచనరత్నసంఖచిత
మహితమహాస్థానమంటపంబునను
తిరవొందకొలువున్న దేవవల్లభుని
సరిగద్దె యెక్కి యచ్చరులు మెచ్చఁగను
కాలకేయాదుల ఖండించు బిరుదు
లోలిదేవత లెల్ల నుగ్గలింపగను
సరసకళావిలసద్వినోదములఁ
బరికించుచున్నట్టి ఫల్గును మ్రోల
నమరసంఘము లెల్ల నచ్చెరువొంద
భ్రమసి సంయమిరాజపటలి వీక్షింప
సురవిభుం డెంతయుఁ జోద్యంబు నొంద
పరివారములు భయభ్రాంతిచేఁ జెలఁగ
వ్రాలిన నమ్మహావాయుసాయకము
పోలించి శాంచి యాపురుహూతసుతుఁడు
ఆయస్త్రమున వ్రాయు నక్షరపంక్తి