పుట:సౌగంధిక ప్రసవాపహరణము.pdf/109

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది

66

సౌగంధిక ప్రసవాపహరణము


లలనలు చిన్నబాలురు వీరవరులు
తెలియఁజెప్పిన [1]దండ దీయరెంతైన270
సకలలోకంబులఁ జండప్రతాప!
అకలంకగతి నిల్పు ననఘుఁడ వీవు
పెలుచ నీపేరు చెప్పినయంత మమ్ముఁ
దలపఁగా శక్యులే ధరణీతలేంద్ర!
ముక్తిప్రదాత కాముని గన్నతండ్రి 275
భక్తశరణ్యుఁ డాపబ్బాంధవుండు
ఘనవర్ణుఁ డఖిలజగద్రక్షకుండు
మనపాలఁ నుండఁగా మరిభయఁ మేల
నుతికెక్కు నానందనుని ఘటోత్కచుని
ధృతిమీర మీసన్నిధిని నిల్పి పోదు.280
ధరణీశ సెలవిమ్ము తడవేల యనిన
నరనాథునకు మ్రొక్కి నకులుఁ డి ట్లనియె.

 నకులుడు ద్రౌపది నంపు మనుట

తావక కీర్తిప్రతాపము ల్సకల

  1. పట్టిన (ట )