పుట:సులక్షణసారము (లింగమకుంట తిమ్మన).pdf/60

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


నెలకొనఁ బద్యముఖంబున
నిలుపరు సత్కవులు శాస్త్రవింద్యము లగుటన్.

238[1]


ఇందుకు ఆదికవిలక్ష్యములు


భీమన్న—


చ.

హయ మది సీత పోతవసుధాధిపుఁ డారయ రావణుండు ని
శ్చయముగ నేను రాఘవుఁడ జాహ్నవి వారధి మారు డంజనీ
ప్రియతనయుండు సింగన విభీషణుఁ డాగుడిమెట్ట లంక నా
జయమును బోతరక్కసుని చావును నేడవనాఁడు సూడుడే.

239[2]


టీక.

1 హకారం 5 సకారం 11 ధకారం


శరభాంకుఁడు—


ఉ.

చాపముగా నహార్యమును చక్రిని బాణము గాఁగ నారిగాఁ
బాపవరేణ్యు జేసి తలపన్ త్రిపురంబులఁ గాల్పవే మహా
దీపితతీవ్రకోపమున దేవత లెల్ల నుతింప నాఁటి విల్
పాపపు డిల్లిమీఁద దెగఁ జాపగదే శరభాంకలింగమా!

240[3]


టీక.

1 చకారం 6 హకారం 11 కకారం. ఇట్లని ఎరుంగవలెను.

16. దేవతావాచక భద్రవాచకాలు

కవికంఠపాశే—


దేవతావాచకాశ్శబ్దాయేచ భద్రాదివాచకాః
తేసర్వేనైవ నింద్యాస్యుర్గణతో లిపితోఽపి వా

241[4]


సాహిత్యచూడామణౌ—


అధసిద్ధి ప్రణవాది శ్రీచంద్రసూర్యదీర్ఘాయుః
ఆరోగ్యకుశలవాణీసాగరమేఘాది మంగళశ్శబ్దాః

242[5]


ఆంధ్రకవిసర్పగారుడే—


క.

తరణీందుభద్రసాగర
గిరికుశలారోగ్మమేఘగీస్తుత్యాయు

  1. సు.సా.లో 220 ప
  2. సు.సా.లో 239 ప
  3. సు.సా.లో 224 ప
  4. ఆ.రం.ఛం. అ 2 ప 164
  5. ఆ.రం.ఛం. అ 2 ప 165