పుట:సులక్షణసారము (లింగమకుంట తిమ్మన).pdf/61

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


స్ఫురదముల కీర్తి సుమనో
త్కరాదివాచకము లిడఁగఁదగుఁ బద్యాదిన్.

243[1]


గీ.

దేవతావాచకముల వర్తిల్లెనేని
భద్రవాచకములఁ గూడి పరగెనేని
నగణ సంపర్కలబ్ధితోఁ దగియెనేనిఁ
గ్రూరసంయుక్తలిపులైనఁ గూడు మొదల.

244[2]


కావ్యచింతామణి-తాతంభట్లు—


క.

నిరుపమ కావ్యాదిని సుర
వర భద్రాద్రి ప్రశస్తవాచకపదముల్
బెరసిన దదుష్టగణా
క్షరదోషములన్ జయించిన సంపద నిచ్చున్.

245[3]


అనంతచ్ఛందసి—


క.

తనరఁగ శుభవాచకములు
ఘన మలరగ దేవవాచకంబులునై పే
ర్చిన గణములు వర్ణంబులు
ననింద్యములు గృతులమొదల నహిపతిశయనా!

246[4]


దేవతావాచకంబులకు లక్ష్యములు—


ఏకావళియందు ‘ప్రాలేయాచల కన్యకా’ యనుట; కల్పవల్లరియందు ‘హేరులు’ (?) మవలంజేయును; మరియు ఉభయకవిమిత్ర విరాటపర్వస్యాదౌ శ్రీయన’ గౌరీనాబర‘గుచెల్వకు’ ననుట గల్గియుండును.

247


భద్రతావాచకలక్ష్యములు—


కాళిదాసస్య శ్యామలాదండకా దావ్యక్తం ‘జయమాతంగతనయే జయ’ ఇతి; నంది తిమ్మయ త్రిస్థలి దండకం ‘విజయనగరిన్ హేమకూటంబునన్ నిల్చి పంపావిరూపాక్షునిం గొల్చి’ యనుట గల్గియుండు, నిటున............

248
  1. ఆ.రం.ఛం. ఆ 2 ప 166
  2. ఆ.రం.ఛం. ఆ 2 ప 167
  3. ఆ.రం.ఛం. ఆ 2 ప 168
  4. ఆ.రం.ఛం. ఆ 2 ప 169