పుట:సులక్షణసారము (లింగమకుంట తిమ్మన).pdf/59

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

15. విషమాక్షరవిచారము

ఆంధ్రోత్తమగండచ్ఛందసి—


క.

అకచట హలనఁగ నేనును
బ్రకటితముగ ఋతుల గిరులఁ బదునొక్కింటన్
నికటముఁగ గూర్చి పద్యము
సుకవులు సత్ప్రభుల కీర శుభదము లగుటన్.

234[1]


అనంతచ్ఛందసి—


క.

పురశర రసగిరి రుద్రుల
నరయ న కచటతప లిడుట యనుచిత మయ్య
క్షరములు నరచఛ జంబులు
బరిహరణీయంబు లాదిఁ బంకజనాభా!

235[2]


కవిసర్పగారుడే—


క.

సంగతిగఁ గృతుల స్త్రీపుం
లింగంబు శబ్దములు మొదల లెస్సగు నిల్పన్
వెంగలి బుద్ధి నపుంసక
లింగంబగు శబ్ద మిడిన లేవు సుఖంబుల్.

236[3]


చ.

రసగిరి రుద్రసంఖ్యలను రాదొన గూర్ప స్వరాదివర్ణముల్
వసుధ హకారమున్ క్షరటవర్ణ చవర్ణములున్ దలంపగా
నస జగడంబు వాగు లిడనై దగుచోట్లు హలాదివర్ణముల్
బొసగదు చెప్ప నాదిరసముల్ చజముల్ గదియింప వర్ణముల్.

237[4]


అథర్వణే—


క.

ఌౡ ఋౠ ఙ ఛఝఞ టఠఢణ
ధలు, నపబభమలు, సరణలతతి, హక్షసులున్

  1. ఆ.రం.ఛం. అ 2 ప 155 సు.సా. 217
  2. ఆ.రం.ఛం. అ 2 ప 157 సు.సా. 218
  3. ఆ.రం.ఛం. అ 2 ప 160 సు.సా.లో 265
  4. సు.సా.లో 219 ప