పుట:సులక్షణసారము (లింగమకుంట తిమ్మన).pdf/58

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


కవిసర్పగారుడే—


సీ.

నణమఙఞ విహీనంబగు వర్గపం
                       చకములఁ గల్గు నక్షరము లెల్ల
నెరయంగఁ గుఱుచలై నిర్జరగతులగు
                       నిడుదలై యుండిన నృగతు లగును
న ఋౠ ఌౡ ఙ ఞ ణ మలు రేఫవిహీన
                       యాద్యష్టకమును దిర్యక్క్రమంబు
లగుగాని రేఫ యధోగతి యగు నిందు
                       (ప్రత్యేకదళము లేర్పడఁగ వరుస


తే.

సురనృగత్యక్షరంబులు శుభము లొసగు)[1]
మధ్యఫలద తిర్యగ్గత మాతృకాళి
నిరయగత వర్ణమొక్కటి నెరయఁగాదు
ప్రౌఢకవులు రచించు కబ్బములమొదల.

228

అల్పప్రాణవర్గాః

అల్పప్రాణవర్గాణాం ప్రథమతృతీయా అంతస్థాశ్చాల్పప్రాణాః
యథా తృతీయా స్తథాపంచమా ఐతరే సర్వే మహాప్రాణాః

229[2]


అథర్వణచ్ఛందసి—


క.

అల్పప్రాణము లతిమృదు
జల్పోచితవచనపంక్తి ఝ ఛ ఘ ధ ఠ ములౌ
నల్పకఠోరాక్షరము బ
వల్పాటగునవి మహాయుతప్రాణంబుల్.

230[3]


అక్షరాణాంగద్యపద్యేన తత్తస్థానప్రయోగ నిషిద్ధా.

231


సాహిత్యరత్నాకరే—


షల్సప్తరుద్రసంస్థాశ్శుక నరహచటే (?)
కలహదాయకా॥ చతుర్థరీతి॥

232
  1. ఆ.రం.ఛం. అ 3 ప 149 మూలములో పోయిన కొంతభాగమును ఆ.రం.ఛం. లోని పద్యమునుం డెత్తి కుండలీకరణములోఁ జూపించితిని.
  2. ఆ.రం.ఛం. అ 2 సం 152
  3. ఆ.రం.ఛం. అ 2 సం 153