పుట:సులక్షణసారము (లింగమకుంట తిమ్మన).pdf/57

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


కవికంఠపాశే—


క.

పంచమవర్గాక్షరముల
నెంచింపక నేత్వ మిత్వ మిడి కృతిమొదలన్
నుంచిన కృతిపతి మిక్కిలి
సంచలితైశ్వర్యుఁ డగుచు జడుగతిఁ దిరుగున్.[1]

222


క.

చొక్కపు పయి శాక్షరములు
తక్కినవర్ణములయందు తలకట్టేత్వం
బక్కజముగఁ గొమ్ము దీర్ఘము
మక్కువతో నియ్యఁబతికి మంగళమమరున్.

223


గోకర్ణచ్ఛందసి-ఋషిప్రోక్తే—


లక్ష్మీప్రదో.............చ్చేద్దుతాశనాత్[2]

224


వ.

అనుట అగ్నియు లక్ష్మీప్రదుఁడైన దేవర అనిన్ని శ్రీకారం లక్ష్మీస్వరూపమనిన్ని ఎరుగవలెను.

225[3]

14. అక్షరాణాం గతయః

కవికంఠపాశే—


దైవన్యతిర్యగ్రౌరవదదావర్ణః (?) తత్క్రమమ్. లఘువోదేహ (?) కచటతపాఅధనరాదిఘా ఇతి.

226


ఆంధ్రభాషాయామ్-


అథర్వణే—


క.

సురవర తిర్యగ్రీరవ
వరగతులగు భూసురాది వర్గాక్షరముల్
గురులఘువులు నరసురగతు
లరిరాయ విఫాల సోమయవనీపాలా[4]!

227
  1. కవికంఠపాశము సంస్కృతరచన. ఈపద్యం దేనిలోనిదో?
  2. ఆ.రం.ఛం. అ 2 సం 148, 149 లలో వేరువేరుగా చెప్పఁబడిన భాగమంతయు నిచ్చట ఒకటిగాఁ జెప్పబడినది. కాబట్టి యిదియె సరయైనదిగా భావించవచ్చును.
  3. ఆ.రం.ఛం. ఆ 2 సం 144
  4. ఇది అథర్వణకృతము కాదు. ఈసంబోధనలు శ్రీధరచ్ఛందస్సు (క్రీ.శ.1350)లోనివి యని తెలియుచున్నది.