పుట:సులక్షణసారము (లింగమకుంట తిమ్మన).pdf/56

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


దీర్ఘాలు విషాలైనందుకు లక్ష్యం


వేములవాడ భీమన్న—


క.

కూరడుగము కాయడుగము
ఆరంగా నుల్లి పచ్చడని యడుగము మా
పేరామీద పో కడిగినన్[1]
బారమ్మున (?) వేసె నట్టి బ్రాహ్మఁడు ద్రెళ్ళెన్.

217


క.

వినబడు దీర్ఘము విషమగు
ననియ నిజమ్మగును సంయుతాక్షర మైనన్
మునుపటి గుణములు విడివడి
తనరన్, వేరొక్కగుణము దాల్చును రామా[2]!

218


విశ్వేశ్వరచ్ఛందః—


క.

శ్రీకారము ప్రథమంబున
ప్రాకటముగ నున్నఁ జాలు బహుదోషములన్
వేకుంచి శుభము లొసగును
ప్రాకృతము నినుము సోకు పరుసము బోలెన్.[3]

219


టీక.

శ్రీకారం బెటువలె నంటె—శవర్ణ, రేఫ, ఈకారములు కూడగా శ్రీకారమాయెను. అందు శవర్ణరేఫలకు గ్రహం చంద్రుఁడు. కనుక ఈకారానకు గ్రహం సూర్యుఁడు. వారిద్దరి కన్యోన్యమైత్రి. కనుక శవర్ణ ఈకారముల కధిదేవత లక్ష్మి. రేఫకు అగ్ని దేవత. అయితేనేమి అగ్ని లక్ష్మీప్రదుండు. ఇందుకు సమ్మతి.[4]

220


చమత్కారచంద్రికాయాం—


[5]

221
  1. మూలములో 'పా కడిగిన' అని యున్నది.
  2. ఆ.రం.ఛం. అ 2 ప 140లో సంభోధన మాత్రము లేదు.
  3. అ ఇది లక్షణసారములోనిది యని ఆ.రం.ఛం. అ 2 ప 145 గా నుదహరింపబడినది. అది పొరపాటని రుజువగుచున్నది. ఇట్లే ఈపద్యము సులక్షణసారములోఁగూడ నుదహరింపబడినది.
  4. ఆ.రం.ఛం.లో 142క్రింది వచనము.
  5. ఉదాహరణ నీయ మరచినాడు. కాని ఆనందరంగరాట్ఛందము 2.143 గా నున్నది.