పుట:సులక్షణసారము (లింగమకుంట తిమ్మన).pdf/55

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


క.

ఌ ౡ అం ఙ ఞ న వలు
పలువితములై వెలుంగు శక్షలు పదియున్
గలుగ గగనబీజముల నాఁ
దెల్లముగా మాద్రవాది దివిజస్తుత్యా!

211[1]


ఇది ప్రస్తరించు లక్షణములు
అ ఇ ఉ ఋ ఌ యీ అయిదువర్గాలకిందను అ విడిచి ఆదులు పదిన్ని కాదులు యాదులు వ్రాస్తే యేర్పఇందులో అనలానిలవర్ణసంయోగం పద్యాదిని రాకుండ బరిహరింపవలెను.

212


ఇందుకు ఫలాలు


ఆంధ్రభాషాయాం-


అథర్వణచ్ఛందసి—


గీ.

గగనబీజంబు పేదఱికంబు; వగపు
వాయుబీజంబు; మృతిఁజేయు వహ్నిబీజ;
మంబుబీజంబు సంతోష; మవనిబీజ
మఖిలసంపత్కరంబు పద్యాదియందు.

213

13. అమృతాక్షరవివేకః

కవికంఠపాశే—


అకచటతపయశ వర్గాదమృతం ప్రోక్తం విషాణి దీర్ఘాణి.

214[2]


ఆంధ్రభాషాయాం-

215


అథర్వణచ్ఛందసి—


క.

అమృతాక్షరములు హ్రస్వము
లమరంగ దీర్ఘములు విఫలు లనబడు వీనిన్
గ్రమమున అకచటతపయశ
సముదయమునఁ దెలిసి నిల్పఁజను పద్యాదిన్.

216[3]
  1. సు.సా.లో 213
  2. ఆ.రం.ఛం. అ 2 ప 137
  3. సు.సా.లో 215 ప