పుట:సులక్షణసారము (లింగమకుంట తిమ్మన).pdf/54

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


అనంతచ్ఛందసి—


క.

ఆదులు వర్గత్రయమును
భూదేవతలు, తపవర్గములు రవలున్ ధా
త్రీయుతుల యలశషసహ
లాదట నూరుజులు ళక్షరాఖ్యలు శూద్రుల్‌.

206[1]

12. తత్త్వాక్షరః

వాదాంగచూడామణి—


క.

పరఁగఁగ అ ఆ ఏ లును
వరుసఁ గ చ ట త ప య ష లు ధ్రువంబుగఁ బడయున్‌
ధరఁ బవన బీజములు గో
వరవాహన! సకలలోకవందితచరణా!

207[2]


క.

క్రమమున ఇ ఈ ఐలును
రమణ ఖ ఛ ఠ థ ఫ రసలును రాజిలఁ బడయున్‌
విమలముగ నగ్నిబీజము
లమరఁగఁ దలపింప శంబరాంతకహరణా!

208[3]


క.

మున్నుగ ఉ ఊ ఓలును నా
యెన్నగ గజడదబలహలు నీ ధరఁ బపదియును నౌ
బన్నుగ భూబీజంబులు
పన్నగవరశయన బాణ! పన్నగభరణా!

209[4]


క.

అరయ ఋ ౠ ఔలును
సారపు ఘ ఝ ఢ ధ భ వళలు సరవిన్‌ బదియున్‌
దోరపు జలబీజంబులు
ఘోరాసురపురవిదార! గోధ్వజకలితా!

210[5]
  1. ఆ.రం.ఛం. అ 2 ప 127
  2. సు.సా.లో 209 ప
  3. సు.సా.లో 210 ప
  4. సు.సా.లో 211 ప
  5. సు.సా.లో 212 ప కాని ప్రారంభపదము భిన్నముగా నున్నది.