పుట:సులక్షణసారము (లింగమకుంట తిమ్మన).pdf/53

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

11. అక్షరాణాం వర్ణవివేకః

అలంకారసంగ్రహే—


ద్విజాయితః పంచదశ పూజ్యాః కచటవర్గజాః
నృపాన్వయాస్తపరవాపర్ణా ద్వాదశ సంస్కృతాః
యలహాశ్శషసా వైశ్కులజాః పూజుతాశ్చషట్
ళక్షరా శ్శూద్రకులజా స్త్రయోవర్ణాః ప్రకీర్తితాః

203[1]


ఆంధ్రభాషాయామ్-


అథర్వణచ్ఛందసి—


క.

వసుధామరులకుఁ గచటలు
వసుధాపతులకునుఁ దపరవలు వైశ్యులకున్‌
యసహలశషలును శూద్రుల
కసమున ళక్షరలుం జెప్ప నగుఁ బద్యాలిన్‌.

204[2]


కవిసర్పగారుడే—


సీ.

కాది త్రివర్గవర్ణాదికి మౌక్తిక
                       వజ్రభూషలుఁ దెల్పు వస్త్రచయము
తపవర్గ రవవర్ణతతి కబ్జరాగంబు
                       తొడవులు వలువలు తొగరుచాయ
యలశషసహ బీజముల కగు పుష్యరా
                       గాభరణములు పీతాంబరములు
ళక్షఱమ్ములకు నీలాలసొమ్ములు కారు
                       కొను నీలివన్నెల కోకలెల్ల


తే.

వరుస నీనాల్గు తెఱఁగుల వర్ణములకు
ననుభవంబగు ద్రవ్యంబు నానబాలు
నాజ్యమును గమ్మదేనియ యాసవంబు
దీనిఁ దెలియ కేగతిఁ గవి యౌను జగతి.

205[3]
  1. ఆ.రం.ఛం. సం 128
  2. ఆ.రం.ఛం. సం 126 సు.సా.లో 239 ప
  3. ఆ.రం.ఛం. సం 133 సు.సా.లో 133 ప