పుట:సులక్షణసారము (లింగమకుంట తిమ్మన).pdf/52

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


క.

పొందెఱిఁగి యానుకూల్యము
బొందగం గూర్చి తగం బ్రయోగింప కృతిన్
సందర్భింప గణాక్షర
బృందం బిర్వురకుఁ జాలఁబ్రీతి యొనర్చున్.

197


క.

తలపోసి గద్యపద్యా
దుల గణముల్ గ్రహములకు నుందొరయుడు మైత్రుల్
గలుగఁగఁ జెప్పిన హస్తా
మలకముగాదె ఫలంబు మహి నిర్వురకున్.

198[1]


ఉ.

లక్కణ మెంచి కైత మొదలన్ సుగణాక్షరముల్ ఘటింప రెం
డక్కరనేలు నేలగలయంతయు సూరెల రాచచేసి కాం
బ్లొ(?)క్కట కొల్వగా మెఱసి యోజయ నిచ్చులుఁ బిచ్చలించు దా
పెక్కిడి గబ్బముల్ వెలయు నెల్లరు మెచ్చు(చునుందు) రెప్పుడున్.

199


కవికంఠపాశే—


అక్షరే పరిశుద్ధేతునాయకో భూప ఉచ్యతే

200[2]


చమత్కారచంద్రికాయామ్—


న్యస్తా: కావ్య
కర్తు: కారయితు, శ్శ్రోతుః కల్పయంతి శుభాశుభమ్.

201[3]

10. అక్షరగ్రహాలకు ఫలితార్థము

తే.

ఆదులకు రవి కాదుల కవనిజుండు
చాదులకు బుధుఁడు, కవి టాదులకును
తాదులకును గురుండు, శని పాదులకును
యాదులకు నెల్ల శశియు గ్రహములు రామ!

202
  1. సు.సా.లో 244 ప
  2. ఆ.రం.ఛం. ప 129
  3. ఆ.రం.ఛం. సం 120 సు.సా.లో 238 ప