పుట:సులక్షణసారము (లింగమకుంట తిమ్మన).pdf/51

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


క.

కమఠారి గ్రహము దైవము
ఖమణి ఫలము ఖేద మాశుగము బీజము ర
క్తిమ ఛాయ కులము వైశ్యము
క్రమముగ నూహింప ష కారంబునకున్. (46)

191


క.

పవనాప్తుఁడు దాబీజము
దేవియు వాణి రుచి యెఱుపు గ్రహము విధుఁడు మూఁ[1]
డవకులము కులము సంపద
కవఁగూడుట ఫలము దా స కారంబునకున్. (47)

192


క.

వరుఁ డీశానుఁడు రజినీ
వరుఁడు గ్రహము ముక్తి ఫలము వసుమతి సుశ్రీ
కరవిజయము రుచి గౌరము
గరిమ కులము వైశ్య మగు హ కారంబునకున్. (48)

193


క.

నలినారి గ్రహము జాడ్యము
ఫలమగు భూతములు పతులు ప్రభ గౌరవము స
త్కులమును శౌద్రము బీజం
బలరంగా జీవనంబు ళా క్షరమునకున్. (49)

194


క.

నరసింహుఁ డధినాథుం
డరయ గ్రహము రుద్రుఁ డన్వయము శౌద్రము తె
ల్పురు తనురుచి ఫలము శుభం
బరుదుగ బీజంబు మిన్ను క్ష కారంబునకున్. (50)

195

9. సంయుక్తాక్షరప్రయోగము

తే.

మొదల సంయుక్తవర్ణంబు గదిసెనేని
మఱువ కా రెంటికిని గృహమైత్రి వలయు
నిది విచారింపరేనిఁ గృతీశ్వరుండు
పిడుగు మొత్తినగతిఁ గూలు బిట్టబిఱ్ఱు.

196[2]
  1. రెండవచరణములో యతిస్థానము సరిగా లేదు.
  2. సు.సా.లో 242 ప