పుట:సులక్షణసారము (లింగమకుంట తిమ్మన).pdf/50

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


క.

ఆభర్త కాలరుద్రుఁడు
క్షోభ ఫలము గ్రహ మర్కజుఁడు శ్యామం బా
శోభయు జననము క్షాత్రం
బాభపదము బీజ మరయ మా క్షరమునకున్. (40)

185


క.

వెన్నెలరాయండు గ్రహము
వన్నె తెలుపు ఫలము లక్ష్మి వైశ్యంబు కులం
బెన్నఁగ కరువలి యేలిక
యన్నయ బీజంబు గాలి యా క్షరమునకున్. (41)

186


క.

సిరిసైదోడు గ్రహం బం
గరుచి యెఱుపు బీజ మగ్ని క్షాత్రము కులమా
వరుఁడు కృశానుఁడు దారా
కరణంబు ఫలం బగున్ ర కారంబునకున్. (42)

187


క.

అంగరుచి నల్పుఁ చితమా
తంగుఁడ (?) పతి ఫలము జాడ్యము శని గ్రహమౌ
రంగు బీజము ధర నే
కాంగకులము వైశ్య మా ల కారంబునకున్. (43)

188


క.

వైరాగ్యం బన్వయ మగు
నారోగ్యాయుష్కముల్ ఫలావళి శ్వేతం
బౌ రుచి పతి వరుణుఁడు కమ
ఠారి గ్రహము బీజ మొప్పు వా క్షరమునకున్. (44)

189


క.

పరిపాలిని కమల నభం
(బరయఁగ) బీజము శశి గ్రహము వన్నియ బం
గరురుచి విభూతి ఫలవై
ఖరి వైశ్యం బన్వయము శ కారంబునకున్. (45)

190