పుట:సులక్షణసారము (లింగమకుంట తిమ్మన).pdf/49

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


క.

ఇల బీజము రుచి శ్యామము
ఫలంబు ధృతి గ్రహము గురుఁడు బాహుజ మరయన్
గులమగు నధినాథుఁడు దా
నలరఁగ నందీశ్వరుండు దా క్షరమునకున్. (33)

178


క.

తెలుపైనట్టి గ్రహం బధి
పాలుఁడు భాస్కరుఁడు కులము బాహుజ ఫలం
బోలి ధృతి జలము బీజము
క్రాలెడు రుచి పీఠమగు ధ కారంబునకున్. (34)

179


క.

గౌరము వర్ణము వంశము
వైరాజ్యము గురుఁడు గ్రహము వరుఁ డీశుఁ డగున్
భూరి పరితాపము ఫలము
నారయ బీజంబు ..........నా క్షరమునకున్. (35)

180


క.

[1](36)

181


క.

అనిలము బీజము గ్రహమగు
శని విఘ్నేశ్వరుఁడు భర్త క్షాత్రము కులమా
తనురుచి గౌరము ఫలముగ
ననుపడి రక్షాప్రదంబు ఫా క్షరమునకున్. (37)

182


క.

ఆరోగ్యదంబు ఫలమా
గౌరము రుచి బీజ మవని గ్రహ మరయంగా
సౌరి పతు లమరవైద్యులు
నారాజాన్వయము బా క్షరమునకున్. (38)

183


క.

ఆతోయము బీజంబగు
ఖ్యాతిగ దైవంబు భద్రకాళి కులము దో
ర్జాతము శని గ్రహము శుభం
బాతతఫల మెఱుపువన్నె భా క్షరమునకున్. (39)

184
  1. ‘ప’కు సంబంధించిన పద్యము మూలములోనే లేదు.