పుట:సులక్షణసారము (లింగమకుంట తిమ్మన).pdf/48

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


క.

కుల మగ్రజంబు ఖేదము
ఫలము తెలుపు ఛాయ గ్రహము భార్గవుం డీశుం
డల నిర్గతి తనురుచి పిం
గళమగు తలపింపగా ఠ కారంబునకునన్. (27)

172


క.

శుభదంబు ఫలము బ్రాహ్మ్యం
బభిజన్మము గ్రహము శుక్రుఁ డగు పీతము పై
ప్రభబీజము నుర్వీశుఁడు
ప్రభుండు డ కారమునకు విపశ్చిదనుజ్ఞన్. (28)

173


క.

బీజంబు ధనము ఫలదము
తేజోనాశకము నల్పుదృఢరుచి బ్రాహ్మ్యం
బాజననము గ్రహము శని
రాజీవాసనుఁడు పతి ఢా క్షరంబునకైనన్. (29)

174


క.

గగనము బీజము వర్ణం
బగురక్తిమ కులము బ్రాహ్మ్య మధిదేవత దా
నగు వాణి గ్రహము శుక్రుఁడు
నగణితలాభంబు ఫలము ణా క్షరమునకున్. (30)

175


క.

కరువలి బీజము భుజగే
శ్వరుఁ డధిపతి గ్రహము గురువు క్షాత్రము కుల మం
గ రుచియు గౌర మవిఘ్నో
త్కహర్షము ఫలము దా త కారంబునకున్. (31)

176


క.

త్రైరాజ్యము కుల మధిపతి
మారుతభుగ్భుజుఁడు గ్రహ మమరగురుఁడు ఫలం
బారణము కాంతి శుక్లా
కారము బీజంబు శుచి థ కారంబునకున్. (32)

177