పుట:సులక్షణసారము (లింగమకుంట తిమ్మన).pdf/45

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


క.

గాలియు బీజము ఛాయా
పాలుఁడు గ్రహ మన్వయంబు బ్రాహ్మ్యము ఫలమున్
బొలతి సుఖము వసంతుం
డేలిక సితంబు ఛాయ ఎ మాతృకకున్. (9)

154


క.

ఇనుఁడు గ్రహ మగ్ని బీజము
జననము బ్రాహ్మ్యంబు రుచిల సద్గౌర మలం
సునవాక్కది ఫలంబగు
నెనయ దర్పకుఁడు భర్త ఏ మాతృకకున్. (10)

155


క.

ఘనవిధి బీజ మరయగ
నినుఁడు గ్రహం బమర వైద్యువినులు బ్రాహ్మ్యం
బనఘకులము రుచి రక్తిమ
తనయ వినాశకము ఫలము తప్పదు ఐ కున్. (11)

156


క.

గగనమణి గ్రహము బీజము
గగనము బ్రాహ్మ్యంబు కులము గౌరము వర్ణం
బగు ఫలము పుత్రనాశక
మగు తలపోయగను వసువు లధిపులు ఒ కున్.[1] (12)

157


క.

ధరణియు బీజము దుర్గయు
పరిపాలిని యినుఁడు గ్రహము బ్రాహ్మ్యము వంశం
బరయగ గౌరము వర్ణం
బురుతరమోక్షదము ఫలము ఓ మాతృకకున్. (13)

158


క.

సలిలము బీజము బ్రాహ్మ్యము
కులము విభూతిదము ఫలము కుముదారి గ్రహం
బలఘు తనుకాంతి గౌరం
బలరెడి చాముండదేవి ఔ మాతృకకున్. (14)

159
  1. నాల్గవచరణం యతిస్థానం సరిగాలేదు.