పుట:సులక్షణసారము (లింగమకుంట తిమ్మన).pdf/46

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


క.

అంబుజమిత్రుఁడు గ్రహము కు
లంబది బ్రాహ్మ్యంబు మునుఫలము ధైర్యము రా
గంబు వర్ణము బీజం
బంబర మాహరుఁడు కర్త అమ్ మాతృకకున్. (15)

160


క.

అనలము బీజము బ్రాహ్మ్యము
జననము భౌముండు గ్రహము శతధృతి నాధుం
డనుపమరుచి కాళిమ
ఘనలక్ష్మియ ఫలమగున్ గకారంబునకున్. (16)

161


క.

తెలుపు రుచి కులము బ్రాహ్మ్యము
నిలిపుండగు భానుఁ డొండె నృపుఁడు గ్రహము మం
గళుఁ డగ్ని బీజ మగు శ్రీ
కలిమియు తత్ఫలమగున్ ఖ కారంబునకున్. (17)

162


క.

ధర బీజము కుల మగ్రజ
మరయగ శోణంబు వర్ణ మగ్నిజుండు గడుగ్రహం
బురు నిత్యఫలము శ్రీదము
కరివరదుఁ డధీశ్వరుండు గ కారంబునకున్. (18)

163


క.

బీజం బుదకము గణపతి
రాజు ఫలము కలిమి కులము బ్రాహ్మ్యము తెలుపై
రాజిల్లు వన్నె గ్రహము
భూజన్ముండగు ఘ కారమున కెందరయన్. (19)

164


క.

నలువుఱవు[1] గ్రహము భౌముఁడు
ఫలంబు శ్రీదంబు కులము బ్రాహ్మ్యము వ్యోమం
బలరంగ బీజము పతి వేం
కటరంగ నృసింహుఁ డాజ్ఞ కారంబునకున్. (20)

  1. నలువు+ఉఱవు సౌందర్యము అధికము