పుట:సులక్షణసారము (లింగమకుంట తిమ్మన).pdf/43

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


క.

ఆదులు పదియాఱనంగ
కాదులు తానిరువదియును నైదు ననంగా
యాదులు తొమ్మిది యనఁగా
నీదెస నక్షరము లమరు నేఁబదియనఁ జమన్.

143


ఇందుకు వివరం— ఆదులు 16. అం అ అనువీనికి రుద్రుండె అధిదేవత – కాన అం అను అక్షరం విడువగా నిల్చినవి పదిహేను. కాదులు 25. యాదులు ళతో గూడి దొమ్మిదిన్ని. క్షకారము – కకార షకార సంయుక్తంబై భిన్నదైవతంబును, ప్రత్యేకఫలంబు నగుట, క్షతో గూడి యాదులు 10. వెరసి అక్షరాలు 50.

144


ఈ అక్షరాలకు—


క.

ఫలములు, గ్రహములు, వర్ణం
బులు, నధిపాలకులును, బలములు నన్వయమున్
దెలిపి యిడవలయు గవితలు
పలికెడు వర్ణంబు లైదుపదులకు మొదలన్.

145


క.

వేవిధము ఫలంబు, రక్తిమ
వర్ణంబు, బీజ మనిలంబు, గ్రహం
బాతనికి కులము బ్రాహ్మ్యము
ఖ్యాతిగ విష్ణుండు పతి అకారంబునకున్. (1)

146


క.

పవనము బీజము దేవత
లవని గ్రహం బినుఁడు బ్రాహ్మ్య మన్వయము రుచి
ప్రణవము గౌరవము హర్ష
మవిరళఫలజాల మొసఁగు ఆ అక్షరమునకున్. (2)

147