పుట:సులక్షణసారము (లింగమకుంట తిమ్మన).pdf/42

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


కవికంఠపాశే—


పర్వతానాం యథామేరుః, సురానాం శంకరో యథా
మృగానాంచ యథాసింహే, గణానాం నగణస్తథా.

138[1]


ఆంధ్రభాషాయాం-అథర్వణచ్ఛందసి—


గీ.

పర్వతములందు మేరువుభాతి యగుచు
సర్వసురలందు శంకరచంద మగుచు
నరయ మృగములయంద సింహంబుకరణి
గణములందెల్ల నగణంబు గరిమ నెగడు.

139[2]


నగణప్రయోగలక్ష్యాలు
నలోదయంబున – ‘హృదయ సదసీ’ యనుటను
శివభద్రంబున – ‘ప్రణమ సదసీ’ యనుటకును జెల్లుచుండును.

140


ప్రబంధపరమేశ్వరుఁడు అరణ్యపర్వశేషప్రారంభకాలంబున శుభ మపేక్షించి నగణప్రయోగం చేసినాఁడు.


చ.

స్ఫురదరుణాంశురాగరుచిఁ బొంపిరివోవ నిరస్తనీరదా
వరణములై దళత్కమలవైభవజృంభణ ముల్లసిల్ల ను
ద్ధతరహంససారసమధువ్రతనిస్వనముల్ చెలంగఁగాఁ
గరము వెలింగె వాపరముఖంబులు శారదవేళఁ జూడఁగన్.

141

8. అక్షరఫలములు

కవిసర్పగారుడే—


క.

శివుసద్యోజాతాది
ప్రవిమలముఖపంచకమునఁ గ్రమమునను సము
ద్భవమై అ ఇ ఉ ఎ ఒ
లావిష్కృతి నవియు నేఁబదై వర్తిల్లున్.

142[3]
  1. ఆ.రం.ఛం. అ 2 ప 103
  2. ఆ.రం.ఛం. అ 2 ప 106 సు.సా. 314
  3. ఆ.రం.ఛం. అ 2 ప 117