పుట:సులక్షణసారము (లింగమకుంట తిమ్మన).pdf/41

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


భీమనమతం – ఫలం ధనం. గ్రహం జీవుఁడు. కులం బ్రాహ్మ్యం. ధవళవర్ణం,
కవిసర్పగారుడము – బసవనమతము – జననం ప్రసుప్తయామం ఎనిమిదవది.

133


ఆదిప్రయోగసరణి


చమత్కారచంద్రికాయామ్—


ధనాకరస్సర్వలఘుర్నగణో బ్రాహ్మదైవతః

134[1]


సాహిత్యచంద్రోదయే—


సమీపస్థో దుర్గుణశ్శుభదోభవేత్,
అయఃకాంచనతామేతి స్వర్ణార్థిస్పర్శవేదినమ్.

135[2]


ఆంధ్రభాషాయాం


(భీమ)న్నచ్ఛందసి—


క.

ఏగణము గదియు నగణం
బాగణము సమస్తమంగళావ్యాప్తంబై
రాగిల్లు నినుము పరసము
యోగంబై పసిండివన్నె నూనినభంగిన్.

136[3]


ఉత్తమగండచ్ఛందసి—


క.

చందనతరు సంగతిఁ బిచు
మందంబులు పరిమళించు మాడ్కిన మందా
నందకరమైన నగణము
పొందున దుష్టగణవర్ణములు ప్రియమొసంగున్.

137[4]
  1. ఆ.రం.ఛం. అ 2 సం 101
  2. ఆ.రం.ఛం. అ 2 సం 102
  3. ఆ.రం.ఛం. అ 2 సం 104 సు.సా.315 ప
  4. ఆ.రం.ఛం. అ 2 ప 105 సు.సా.415 ప