పుట:సులక్షణసారము (లింగమకుంట తిమ్మన).pdf/40

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


ఉ.

శ్రీనుతమూర్తియైన రఘుశేఖరు తేజముఁ బోలె పర్వుచున్
భానుసహస్రమండలవిభాసి సమగ్రతరప్రకాశుఁడై
మానుగ మింటితో నొరయు మంటలు దిక్కుల గ్రమ్మ నుగ్రవై
శ్వానరుఁ డేపుతో నెసగె వానరరోషసముద్రుఁడో యనన్.

129

8. నగణస్య

వాదాంగచూడామణౌ—


చ.

గుణముల కెల్ల నాకరము కోరి కృతీంద్రుని డాసియున్న దు
ర్గుణగణదోషమున్ జెరుచు కోరినవస్తువినూత్నరత్నభూ
షణముల నిచ్చుఁ గావున లసత్కవిశేఖరుఁ బెంచు సర్వల
క్షణములఁ గల్గి యొప్పుబుధ సన్నుతమైన గణంబు శంకరా!

130[1]


కవిసర్పగారుడే—


మ.

పరమాత్ముం డధినాయకుండు జయసౌభాగ్యైకసామ్రాజ్యపూ
జ్యరమాసంతతు లీగి లబ్ధి మునిజోపాంతస్థదుష్టాక్షరో
త్కరదోషాఢ్యగుణౌఘధూర్తగుణముల్ ఖండించుటల్ చాల యె
వ్వరికిన్ గాదనరాదు నానగణ మవ్యాజస్థితిన్ బొల్పగున్.

131[2]


ఉత్తమగండచ్ఛందసి—


క.

శుభసుఖ మక్షయ ధనకన
కభయైశ్వర్యములం జేయుం గ్రమమునన్ గార్య
ప్రభులకు, కవులకు గృతులను
మభజసనయరత గణాలి మల్లియరేచా[3]!

132


టీక.

పరమాత్మ అధిదేవత అన్నారు, గాని నగణం సర్వశుభదం. కనుక మిగిలిన కవీశ్వరులు యెన్ని వ్రాసినవారు కారు.

  1. ఆ.రం.ఛం. అ 2 ప 98
  2. ఆ.రం.ఛం. అ 2 ప 99. సు.సా. ప 257
  3. మల్లియరేచన కవిజనాశ్రయములోనిది గాని ఉత్తమగండ ఛందస్సులోనిది కాదని సంబోధన విశదపరుచుచున్నది.