పుట:సులక్షణసారము (లింగమకుంట తిమ్మన).pdf/39

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


ఆదిప్రయోగసరణి


సాహిత్యరత్నాకరే—


దినకరముఖగ్రహణామ్
ఇనశశివర్తతస్యరజని గుణం.

124[1]


ఆంధ్రభాషాయామ్-


కవిసర్పగారుడే—


ఆ.

చంద్రుఁ డేగ్రహంబుసరస నిల్చిన వాని
వర్ణమై శుభాశుభంబు లిచ్చు
భగణము మగణంబు నొగి నిలం దత్భలం
బిచ్చు దనకు చంద్రుఁ డధీశుఁ డగుట.

125[2]


అథర్వణఛందసి—


క.

యగణంబు గదిసి చంపును
రగణముతో గూడి ఘోరరణ మొనరించున్
భగణ మిక నొక్కచిత్రము
మగణముతో గూడ కాలమానము పతికిన్.

126


వ.

భగణం ప్రత్యేకం కాని సకలశుభముల నీయజాలినందుకు లక్ష్యం.

127


శ్రీమద్రామాయణ యుద్ధకాండశేషే లంకాదహనము పట్టుకథ – అవక్రమిస్తున్న శుభ మపేక్షించి భగణానకు చంద్రుఁడే అధిపతిన్ని, గ్రహముం గన్న అయ్యలభట్టు భగణప్రయోగం చేసినాఁడు.

128
  1. ఆ.రం.ఛం. అ 2 ప 94
  2. ఆ.రం.ఛం. అ 2 ప 95