పుట:సులక్షణసారము (లింగమకుంట తిమ్మన).pdf/38

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


వీరార్య లక్షణాదినికాయమ్—


ప్రణమ్య విద్వజ్జనపారిజాతమ్.

119[1]


సూర్యసిద్ధాంతే—


అచింత్యా వ్యక్తరూపమితి

120

7. భగణస్య

వాదాంగచూడామణౌ—


ఉ.

చంద్రుఁ డధీశ్వరుం డమృతసారము కాంతియు, విట్కులంబు, త
చ్చంద్రుఁడె తద్గ్రహం బతని చాయయుఁ దెల్పు, వృషంబు రాశి, భో
గీంద్రసుయోని, దేవగణ, మీప్సితసౌఖ్యము తత్ఫలంబునున్
జంద్రునితార యెన్నఁగను జంద్రధరా భగణాన కెన్నఁగన్.

121[2]


కవిసర్పగారుడే—


మ.

పతి చంద్రుం, డహి యోని, రాశి వృష, మా వంశంబు దై
వత మెన్నం గణమా ఫలంబు సుఖమా, వర్ణంబు శ్వేతంబు, సం
యుతనక్షత్రము చెప్పఁగా మృగశిరం బుద్యద్గ్రహం బా నిశా
పతి, హాస్యంబు రసంబు నా భగణ మొప్ప న్మించె సన్మూర్తియై.

122[3]


టీక.

చంద్రుఁ డధిదేవత, వర్ణం తెల్పు, ఉచ్ఛకులం, గ్రహం చంద్రుఁడు, అతనివర్ణం తెల్పు, వృషభరాశి, సర్పయోని, దైవగణం, ఫలం సుఖం, నక్షత్రం మృగశిర, హాస్యరసం, అంగీరసగోత్రం జననం సుప్రనామం ఒకపరి.

123
  1. ఆ.రం.ఛం. అ 2 ప 88
  2. ఆ.రం.ఛం. అ 2 ప 92. సు.సా.లో 256 ప
  3. ఆ.రం.ఛం. అ 2 ప 93