పుట:సులక్షణసారము (లింగమకుంట తిమ్మన).pdf/4

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

డని శ్రీ నిడదవోలు వేంకటరావుగారు వ్రాసియున్నారు[1]. ఈలక్షణగ్రంథ మింతవఱకు ముద్రణభాగ్యమును నోచుకొనలేదు గాన దీనినిగుఱించి యధికముఁగా జెప్పుటకు వీలు లేదు.

లక్షణగ్రంథములలో కెల్ల లింగమగుంట తిమ్మన వ్రాసిన సులక్షణసారమునకు మిక్కిలి జనత (పాప్యులారిటి) గలదు. కాని యాజనతయంతయు గణములు, యతులు, ప్ర్రాసలు దెలుపు భాగమునకే, కాని మిగత దానికిఁ గాదు. కావున నాగణాదుల భాగమే క్రీ. శ. 1862 లో ముద్రణ కెక్కినది.

సులక్షణ సారములోఁ గొంతభాగమే యచ్చున కెక్కినదని ముద్రాపకులు, పండితులు క్రమక్రమముగా గ్రహించిరి. మిగతభాగమునకై కొందఱు శ్రమపడినాడు. కాని లాభించలేదు. ఇతరగ్రంథములలో నుదహరింపఁబడిన పద్యములను మాత్రమే యొకచోటఁ జేర్చి తృప్తి నొందవలసివచ్చినది.

శ్రీ వీరేశలింగముగారు తమ కవులచరిత్రలోఁ సులక్షణసారము చిన్నది కాదు. వారి కంటఁబడిన పుస్తకము పెద్దదియే. కాని యది యేలకో యచ్చునకు రాలేదు. దానిగతి యేమైనదో కూడ తెలియదు. ఇప్పుడు నాకు దొరికిన పుస్తకభాగములో వా రుదాహరించిన కవుల పేరులు, పద్యములు చాలవఱకు గలవు.

నాకు దొరకిన పుస్తకములోఁ దిమ్మకవి తన వంశాదికమునుగుఱించి చెప్పికొన్న పద్యములకుఁ బిమ్మట నక్షరముల, గణములయొక్క యాధ్యాత్మికప్రభావము (స్పిరిచ్యుయాలిటి) గలదు. ఈమాత్రము గ్రంథమైనకు లభించినదే!

నాకు లభించిన పుస్తకము లింగమగుంట తిమ్మన రచించిన సులక్షణసార మౌనా, కాదా యను ప్రశ్న యుత్తరమును గోరు

  1. చాగంటి శేషయ్య గారి యాంధ్రకవితరంగిణి సం 9. పుట 185.