పుట:సులక్షణసారము (లింగమకుంట తిమ్మన).pdf/32

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


ఆంధ్రభాషవలన విశేషం గలదు.

75[1]


సాహిత్యరత్నాకరే—


నిత్యం భగణ సాన్నిధ్యాత్యర్వాభీష్టఫలవ్రతః
కర్తుః కారయితాశ్చైవ తగణోవ్యోమదేవతః

76[2]


ఇత్యత్రోదాహరణం


అమరుక కావ్యే—


జ్యాకృష్ణబద్ధ కటకాముఖపాణి పద్మమితి

77[3]


ఆంధ్రభాషాయామ్


ఉత్తమగండఛందసి—


క.

తగణము తొల్తఁ బిమ్మట
భగణము గదియంగ నిల్పి పద్యము హృద్యం
బుగ రచియించినఁ గర్తకు
నగణితముగ నొదవు నాయురైశ్వర్యంబుల్.

78[4]


వ.

ఇటువలె శుభగ్రహం కూడినను తనగుణం విడువనేరదని కొందరన్నారు.

79


కవితనయకర్తృకత్వాత్ ప్రకృత్యా (?) హాని దస్తగణః
యధాపలాండుః శ్రీగంధయోగేనకిం సుగంధోభవతి ఇతి.
శ్రీగంధంతోగూడినా వుల్లి కూడినా తన మునుపటిగుణం విడువనేరదు అనుట.

80


అంటేనేమి – తగణానికి అధిదేవత గగనం ఆగగనం నిత్యవిభువు; గాన తగణం మంచిది.

81
  1. ఈవచనము స్థలము మారినట్లుగాఁ తోచుచున్నది.
  2. ఆ.రం.ఛం. అ 2. సం 57
  3. ఆ.రం.ఛం. అ 2. సం 62
  4. ఆ.రం.ఛం. అ 2. ప 58