పుట:సులక్షణసారము (లింగమకుంట తిమ్మన).pdf/33

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


గీ.

లలితముగ మంచిదని భువి వెలసినట్లు
గణములకు లక్ష్యముల వెల్లగాని వనిన
తగణజగణంబులకు వ్రాసెదను మహాక
వీంద్రయోగలక్ష్యంబులు వెతకినేను.

82


చమత్కారచంద్రికా—


ఈశత్వమంత్యమ లఘుస్తగణోవ్యోమదైతః

83[1]


సాహిత్యచంద్రోదయే—


తగణస్సర్వసౌభాగ్యదోయక స్సర్వదాభవేత్.

84[2]


తాతంభట్లు—


క.

తగణంబున కధిదేవత
గగనం బది శూన్య మనుచు గాదని పల్కన్
జదగ దది, మిక్కిలి మంచిది
గగనం బిది నిత్యవిభువు గావున, దెలియన్.

85[3]


ద్వితీయస్కంధే—


ఉ.

సర్వఫలప్రవాతయును, సర్వశరణ్యుఁడు, సర్వశక్తియున్
సర్వజగత్ప్రసిద్ధుఁడును, సర్వగుణాఢ్యుఁడునైన చక్రి యీ
సర్వశరీరు లుర్విగతసంజ్ఞలఁ జెంది విశీర్ణమానులై
పర్వడుచో నభంబుగతి బ్రహ్మము దాఁ జెడకుండు నెప్పుడు.

86


వ.

మరిన్నీ


నానాలంకారేషు—

87


పదవాక్యప్రమాణజ్ఞైర్మహాకవిభిస్తద్గ్రంథాదౌ.

88
  1. ఆ.రం.ఛం. అ 2. సం 59
  2. ఆ.రం.ఛం. అ 2. సం 60
  3. ఆ.రం.ఛం. అ 2. సం 61. సు.సా. 307 ప