పుట:సులక్షణసారము (లింగమకుంట తిమ్మన).pdf/31

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


కవిసర్పగారుడే—


మ.

అమరన్ మిన్నధిదైవ మక్కులము బ్రాహ్మం బాగణం బెన్న దై
వము జీవుండు గ్రహంబు నల్పురుచి యైశ్వర్యంబు లబ్ధంబు మే
షము దాయోని రసంబు శాంత మల నక్షత్రంబు పుష్యంబు రా
శి మహిన్ గర్కటకంబు నాఁ దగణ ముత్సేకంబగున్ జెల్వమై.

69[1]


భీమన—


క.

మగణంబు శూద్రకులజుఁడు
భగణం బైశ్వర్యరాశి, బ్రాహ్మణజాతుల్
నగణము, తగణము, యగణము
జగణము నృపజాతి యంత్యజులు రసగణముల్.

70[2]


వ.

అధిదేవత ఆకాశం, నీలవర్ణం, బ్రాహ్మణజాతి, గ్రహం బృహస్పతి, అతండు కాంచనవర్ణం, ఫలమైశ్వర్యం, పుష్యమీనక్షత్రం, కర్కటరాశి, మేషయోని, దేవగణం, శాంతరసం, వసిష్ఠగోత్రం, జననం రామనాడు ఏడవజాము.
భీమన గ్రహం రాహుఁ డన్నాడు. పరిహరంబు మునుపె వ్రాసినది.

71


ప్రయోగసరణి—


సాహిత్యరత్నాకరే—


తో హృ (?) రంత్యలఘు సుఖముఖమితి (?)

72


అలంకారచూడామణి—


గగనేశూన్యమితి.

73


కవికంఠపాశే—


వ్యోమశూన్యం హి (?) తనుత యితి

74
  1. ఆ.రం.ఛం. అ 2 ప 56. సు.సా. 254 ప
  2. ఆ.సా.ప.వారి కవిజనాశ్రయము సంజ్ఞా. ప 28