పుట:సులక్షణసారము (లింగమకుంట తిమ్మన).pdf/30

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


ఛప్పన్నే—


సగణం కానిదయితేనేమి గురశుక్రగ్రహవృద్ధగణాలు సమీపాన నున్నను వెనుక గుజగ్రహాధిష్ఠితగణం లేకున్నా మంచిదని ఎరిగేది.

63[1]


ఆంధ్రభాషాయాం-


అథర్వణఛందసి—


క.

మునుకొని పద్యముఖంబున
ననిలగణం బిడ్డనాయురారోగ్యంబుల్
గొనసాగు దాని ముందట
ననలగణంబడినఁబతికి నలజడి సేయున్.

64[2]


ఇందుకు చెల్లుబడియున్నది.


సాహిత్యచంద్రోదయే—


సగణచ్ఛందసి జ్ఞేయోరగణస్య పురస్థితోయదితి

65[3]


అత్రోదాహరణమ్ – సార్వభౌమకవి—


అనలంబస్యహేరంబమితోత్సాహ.

66[4]


వృత్తరత్నాకరే-కేదారకవిః—


సుఖసంతాన సిద్ధ్యర్థమిత్యాహ.

67[5]

5. తగణస్య

వాదాంగచూడామణౌ—


చ.

నెఱయ నభంబు దైవ మతినీలము కాంతియు విప్రజాతి గీ
ర్వరుఁడు గ్రహంబుఁ గాంచనము వర్ణ మతండు ఫలంబు చెప్ప నై
శ్వర్యము తార పుష్యమియు వాలిన కర్కటరాశి మేషమౌ
నిరవగుయోని దేవగణ మీతగణంబున కిందుశేఖరా!

68[6]
  1. కర్త పేరున్నది. కాని తెలుగులో నుండుటచే ననుమానింపదగియున్నది.
  2. ఆ.రం.ఛం. అ 2. సం 50. సు.సా.లో 303 ప
  3. ఆ.రం.ఛం. అ 2. సం49
  4. ఆ.రం.ఛం. అ 2. సం 51
  5. ఆ.రం.ఛం. అ 2. సం 52
  6. ఆ.రం.ఛం. అ 2. ప 55. మూడవచరణములోని మొదటిగణము తప్పుగా నున్నది.