పుట:సులక్షణసారము (లింగమకుంట తిమ్మన).pdf/26

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


కవిసర్పగారుడే—


మ.

అనలుం డీశుఁడు రాశి మేషము గ్రహం బా భౌముఁ డాతారర సం
ప్రణతిన్‌ గృత్తిక దైత్యమాగణము వై రాజ్యంబు వశంబు మేఁ
కనెఱి న్యోని ఫలము భీరసము శృంగారంబు తత్కాంతికో
కనదచ్ఛ చ్ఛవి మించు నా రగణ మేకాలంబు నొప్పున్‌ భువిన్‌.

46[1]


టీక.

అగ్ని అధిదేవత, క్షత్రియకులం, కాంతి యెఱుపు, గ్రహ మంగారకుఁడు, అతనివన్నె యెఱుపు, నక్షత్రం కృత్తిక, రాక్షసగణం, మేషరాశి, ఫలం భీతి, శృంగారరసం, కౌశికసగోత్రం, జననం డంఖరామయామం మూఁడవది.


భీమన్న మతాలు – శనిగ్రహ మన్నారు. అందుకు పరిహారం ముందే వ్రాసినది.


ఆదిప్రయోగసరణి
సాహిత్యరత్నాకరే—


రోగ్నిమధ్యలఘు వృత్తి (?) భేతి.

47


చమత్కారచంద్రికాయాం—


భీతిదాయీ మధ్యలఘూ రగణోవహ్ని దైవత ఇతి. ఇదం సత్యం. గణ
యోగవిశాషాని చాది పరిగ్రహస్య శ్రీకరమిత శాస్త్రం

48[2]


టీక.

గ్రహాలున్ను, అధిదేవతలున్ను మిత్రత్వం, గణాలుం గూడి
నపుడు రగణం మంచిది. ఎటువలెనంటె -


సాహిత్యచంద్రోదయే—


రగణ శ్శ్రీకరః పుంసాంయగణానుగతోయది
గద్యపద్యప్రబంధాదౌతత్రోదాహరణం కృతిః

49[3]
  1. ఆ.రం.ఛం. అ 2. ప 31. సు.సా.లో 252 టీ.
  2. ఆ.రం.ఛం. ఆ 2. సం 32
  3. ఆ.రం.ఛం. అ 2 సం 33